రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు రామేశ్వరం ఆనాబంకు వద్ద శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైయస్ఆర్సీపీ నాయకులు పాతకోట బంగారు రెడ్డి, పాతకోట వంశీధర్ రెడ్డి, ద్వార్శల గురునాథ్ రెడ్డి తదితరులు పాల్గొనగా, మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.
శ్రీ చౌడేశ్వరి మాత జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు ప్రొద్దుటూరు పట్టణంలోని స్థానిక రామేశ్వరం ఆనాబంకు వద్ద గల శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
ఆలయ అర్చకులు సంప్రదాయ విధానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి