రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి
శ్రీ సత్యసాయి జిల్లాను నేర రహిత జిల్లాగా మార్చేందుకు జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులపై కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. గత ఆరు నెలల్లో 364 డ్రంక్ అండ్ డ్రైవ్, 2,248 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసి, సుమారు ₹34 లక్షల జరిమానాలు విధించడంతో పాటు కొందరిని జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.
చట్టాలను గౌరవించి, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేర రహిత శ్రీ సత్యసాయి జిల్లా లక్ష్యం: డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం శ్రీ సత్యసాయి జిల్లాను నేర రహిత జిల్లాగా మార్చడం లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తోంది.
ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపే డ్రైవర్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి