రాయలసీమ న్యూస్ - తిరుపతి

శ్రీకాళహస్తి దేవస్థానం అంబులెన్సుల నిర్లక్ష్య వినియోగంపై భక్తుల ఆవేదన

శ్రీకాళహస్తి దేవస్థానం పరిధిలో ఉన్న నాలుగు అంబులెన్సులను అధికారులు సక్రమంగా వినియోగించకపోవడంతో భక్తులు, దాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం భక్తి భావంతో విరాళంగా ఇచ్చిన ఈ వాహనాలు టూరిస్ట్ బస్టాండ్ వద్ద తుప్పుపట్టి నిరుపయోగంగా ఉండటం దేవస్థానం నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు.

ఇప్పటికైనా మరమ్మతులు చేసి, స్పష్టమైన విధానంతో అంబులెన్సు సేవలను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం అంబులెన్సుల నిర్లక్ష్య వినియోగంపై భక్తుల ఆవేదన శ్రీకాళహస్తి దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భక్తులు, దాతలు ఎంతో భక్తి భావంతో దేవస్థానానికి విరాళంగా అందజేసిన అంబులెన్సులు వినియోగానికి నోచుకోకుండా మూలన పడేయడంపై భక్తులు, దాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన పలువురు దాతలు, అలాగే కొన్ని బ్యాంకుల యాజమాన్యాలు భక్తి భావంతో దేవస్థానానికి అంబులెన్సులను బహుకరించిన విషయం తెలిసిందే.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →