రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎన్టీఆర్ నగర్‌లో ముగ్గురు మైనర్లు మద్యం సేవించి ఆటోపై దాడి చేయడంతో ప్రాంతంలో గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు వెంటనే చేరుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
యువతలో పెరుగుతున్న మద్యం అలవాటు, మైనర్లకు మద్యం విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. శ్రీకాళహస్తి ఎన్టీఆర్ నగర్‌లో మైనర్ల హల్‌చల్… మద్యం మత్తులో ఆటోపై దాడి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్‌లో ముగ్గురు మైనర్లు మద్యం సేవించి రెచ్చిపోయిన ఘటన ఆదివారం రాత్రి స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు దారితీసింది.
మద్యం మత్తులో ఉన్న టీనేజర్లు అక్కడి రహదారిపై వెళ్తున్న ఒక ఆటోపై దాడి చేసినట్లు సమాచారం. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి