రాయలసీమ న్యూస్ - నంద్యాల

శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది

కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్ట్ నుండి 2,45,183 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 863.90 అడుగులు, నిల్వ 118.6216 టీఎంసీలకు చేరగా, ఔట్‌ఫ్లో లేదు.

నీటిమట్టం పెరుగుతుండటంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరించగా, దిగువన ఉన్న ప్రాజెక్టులు, తాగునీటి అవసరాలకు రాబోయే రోజుల్లో నీటి అందుబాటు మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు నిరంతరంగా చేరుతోంది.

జూరాల ప్రాజెక్ట్ నుండి భారీగా నీటి విడుదల కొనసాగడంతో, గురువారం ఉదయం 6.00 గంటల సమయానికి జలాశయానికి గణనీయమైన ఇన్‌ఫ్లో నమోదైంది. అధికారుల సమాచారం ప్రకారం జూరాల నుండి శ్రీశైలం జలాశయానికి 2,45,183 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →