రాయలసీమ న్యూస్ - నంద్యాల
ఆగష్టు నెల 13 నుంచి సెప్టెంబర్ 15 వరకు శ్రీశైలం క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం, ఆదివారం, సోమవారం రోజుల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను తాత్కాలికంగా నిలిపి, సాధారణ దర్శనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
దర్శనం, సేవా టికెట్లను అధికారిక వెబ్‌సైట్, ‘మన మిత్ర’ యాప్ ద్వారా ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని దేవస్థానం సూచించింది. శ్రీశైలం క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలకు భారీ ఏర్పాట్లు ఆగష్టు నెల 13 నుంచి శ్రీశైలం క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
సెప్టెంబర్ 15 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నట్లు శ్రీశైల దేవస్థానం చైర్మన్, ఈవో వెల్లడించారు. శ్రావణ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శ్రీశైలం క్షేత్రానికి తరలివచ్చే అవకాశం ఉండటంతో దర్శన, వసతి, ఇతర సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి