రాయలసీమ న్యూస్ - తిరుపతి

కొత్త వధూవరులకు శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొనే సువర్ణావకాశం

తిరుమలలో కొత్తగా వివాహం చేసుకున్న వధూవరులకు TTD రోజుకు 20 శ్రీవారి కళ్యాణోత్సవ టికెట్ల ప్రత్యేక కోటా కేటాయించింది. వివాహం జరిగిన వారం రోజుల్లోపు తిరుమల CRO కార్యాలయంలో ఆర్జిత సేవా లక్కీడిప్‌ కౌంటర్‌ ద్వారా దరఖాస్తు చేసి, వివాహ ఆహ్వాన పత్రిక, పెళ్లి ఫొటో, ఆధార్‌ కార్డు వంటి ఆధారాలు సమర్పించాలి.

విశేష పర్వదినాలు, ముఖ్య ఉత్సవాల రోజుల్లో ఈ ప్రత్యేక కోటా అమలు ఉండదని TTD స్పష్టం చేసింది. కొత్త వధూవరులకు శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొనే సువర్ణావకాశం తిరుమలలో కొత్తగా వివాహం చేసుకున్న వధూవరులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది.

శ్రీవారి కళ్యాణోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు నూతన పెళ్లి జంటలకు రోజుకు 20 కళ్యాణోత్సవ టికెట్లు కేటాయించాలని TTD నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇటీవల వివాహం చేసుకున్న దంపతులు శ్రీవారి సేవలో భాగస్వాములు కావడానికి అవకాశం లభిస్తోంది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →