రాయలసీమ న్యూస్ - అన్నమయ్య

‘స్త్రీ శక్తి’ పథకం ఏడాది పూర్తి.. ఆర్టీసీ బస్సుల్లో క్షేత్రస్థాయి పరిశీలన

‘స్త్రీ శక్తి’ పథకం ఏడాది పూర్తి సందర్భంగా రాజంపేటలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులతో మాట్లాడి పథకం అమలు తీరును పరిశీలించారు. ఈ పథకం వల్ల ప్రయాణ ఖర్చులు తగ్గి, ఇంటి అవసరాల కోసం స్వయంగా తిరగగలగడం, పుణ్యక్షేత్రాలు, కార్పొరేట్ ఆసుపత్రులకు ఉచిత ప్రయాణం సాధ్యమై మహిళలకు ఆర్థిక స్వావలంబన, ఊరట కలుగుతోందని వారు అభిప్రాయపడ్డారు.

‘స్త్రీ శక్తి’ పథకం ఏడాది పూర్తి.. ఆర్టీసీ బస్సుల్లో క్షేత్రస్థాయి పరిశీలన రాజంపేట: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు శనివారం ఆర్టీసీ బస్సుల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు.

రాజంపేట పరిసర ప్రాంతాల్లో నడుస్తున్న బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులతో ప్రత్యక్షంగా మాట్లాడి, పథకం అమలు తీరును తెలుసుకున్నారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలను ఒక్కొక్కరిని ప్రశ్నిస్తూ పథకం వల్ల వారికి కలుగుతున్న ప్రయోజనాలు, రోజుకు ఎన్నిసార్లు బస్సుల్లో ప్రయాణిస్తున్నారో, ప్రయాణ సమయంలో ఆర్టీసీ సిబ్బంది నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయో వివరంగా ఆరా తీశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →