రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతి RC రోడ్‌లోని SBFC గోల్డ్ లోన్ బ్రాంచ్‌లో ఎంప్లాయీ సునీల్ తన బంగారం విడుదల చేస్తానని నమ్మబలికి 2.5 లక్షలు తీసుకుని పరారయ్యాడని బాధితుడు లోకేష్ ఆరోపిస్తున్నారు. బ్రాంచ్ స్టాఫ్, మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యంపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన న్యాయం జరిగే వరకు బ్రాంచ్‌లోనే నిరసన కొనసాగిస్తానని హెచ్చరిస్తూ, SBFC ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
తిరుపతి SBFC గోల్డ్ లోన్ బ్రాంచ్‌లో మోసం ఆరోపణలు తిరుపతి నగరంలోని RC రోడ్‌లో ఉన్న SBFC ప్రైవేట్ గోల్డ్ లోన్ బ్రాంచ్‌లో ఘరానా మోసం జరిగినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. కంపెనీ ప్రారంభించి ఐదు నెలలు కూడా పూర్తికాకముందే ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
బాధితుడు లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం, SBFC RC రోడ్ బ్రాంచ్‌లో తాకట్టు పెట్టిన బంగారం తిరిగి ఇప్పిస్తానని కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీ సునీల్ తనను నమ్మబలికి, 2,50,000 రూపాయలు తీసుకుని పరారైనట్టు ఆరోపణలు ఉన్నాయి. బంగారం విడుదలకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా ఈ మొత్తం తీసుకున్న తర్వాత సునీల్ కనిపించకుండా పోయాడని లోకేష్ పేర్కొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి