రాయలసీమ న్యూస్ నేషనల్ డెస్క్

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు : బిల్లుకు లోక్‌సభ ఆమోదం

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, రామమందిర విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటంతో చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లుకు లోక్‌సభ ఆమోదం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 నుంచి 38కి పెంచుతూ జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

అయితే, నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, రామమందిర విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటంతో ఎలాంటి చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది. ఆర్డినెన్స్ జారీని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా మూజువాణి ఓటుతో సభ తిరస్కరించింది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →