రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆగస్టు 15న జరగనున్న స్వచ్ఛ సంకల్ప దీక్ష కోసం మున్సిపల్, పోలీసు శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్, పోలీసు అధికారులు సభా ప్రాంగణం, ట్రాఫిక్, భద్రత, పార్కింగ్ వంటి అంశాలను పరిశీలించి, పెద్ద ఎత్తున హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు.
స్వచ్ఛ సంకల్ప దీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు:పరిశీలించిన కమిషనర్ ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న “స్వచ్ఛ సంకల్ప దీక్ష” కార్యక్రమం విజయవంతం కావడానికి మున్సిపల్ అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం గౌరవ యం ఎల్ ఎ నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో జరగనుంది.
ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ అనిబిసెంట్ హై స్కూల్ లో ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణాన్ని సోమవారం మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పరిశీలించారు. కార్యక్రమానికి ముందు చేపట్టాల్సిన ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి