రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు హామీ ఇవ్వాలి: SYF రాష్ట్ర కమిటీ డిమాండ్

SYF రాష్ట్ర కమిటీ కడప సమావేశంలో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, జూనియర్ డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఉద్యోగ నియామకాల్లో ప్రతి దశలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, APPSC Group-I, DSC, PRC–IR, స్టైఫండ్ వంటి అంశాలపై అనుమానాలు నివృత్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది.

సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు హామీ ఇవ్వాలి: SYF రాష్ట్ర కమిటీ డిమాండ్ కడప : రాష్ట్రంలో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సోషలిస్ట్ యూత్ ఫెడరేషన్ (SYF) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

ఉద్యోగ నియామకాల్లో పూర్తి పారదర్శకత పాటించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని కమిటీ హెచ్చరించింది. ఆదివారం కడపలో జరిగిన SYF రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులు, యువత సమస్యలు, ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగం, ఉద్యోగుల డిమాండ్లు, ప్రజాస్వామ్య హక్కులపై విస్తృతంగా చర్చ జరిగింది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →