రాయలసీమ న్యూస్ - కర్నూలు

కర్నూలు MRO కార్యాలయంలో TDP నేత హంగామా

కర్నూలు జిల్లా ఆదోని మండలంలో TDP మండల అధ్యక్షుడు శివప్ప MRO కార్యాలయంలో రేషన్ షాప్ కేటాయింపుపై రెవెన్యూ సిబ్బందితో ఘర్షణకు దిగిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఆర్ఐ లక్ష్మయ్యపై అసభ్య పదజాలంతో దూషిస్తూ, ఆఫీస్‌లో నేలపై పడుకొని హంగామా చేసిన వీడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, శివప్పను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

కర్నూలు MRO కార్యాలయంలో TDP నేత హంగామా కర్నూలు జిల్లా ఆదోని మండలంలో తెలుగు దేశం పార్టీ నేత శివప్ప వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఆదోని TDP మండల అధ్యక్షుడు శివప్ప శనివారం MRO కార్యాలయంలో చేసిన హంగామా ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది.

రేషన్ షాప్ కేటాయింపు విషయంలో రెవెన్యూ సిబ్బందిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శనివారం జరిగిన ఈ ఘటనలో శివప్ప, రెవెన్యూ ఆర్ఐ లక్ష్మయ్యపై తీవ్రస్థాయిలో మండిపడ్డారని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →