రాయలసీమ న్యూస్ - చిత్తూరు
చిత్తూరు టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు లీలావతి, ఆమె కుమారుడు Anush Chowdaryపై ఒక యువతి తీవ్ర వేధింపుల ఆరోపణలు చేస్తూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఉద్యోగం పేరుతో బొటిక్‌కు పిలిపించి మానసిక, శారీరక వేధింపులు చేశారని, పెళ్లి ఒత్తిడి తెచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె పేర్కొనగా, మహిళా సంఘాలు, కార్యకర్తలు విచారణతో పాటు మహిళల భద్రతకు కఠిన చర్యలు కోరుతున్నారు.
టీడీపీ మహిళా అధ్యక్షురాలు ముసుగులో దారుణాలు ఆరోపణలతో సంచలనం చిత్తూరు జిల్లా టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు లీలావతి పై ఒక యువతి తీవ్ర ఆరోపణలు చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. బొటిక్‌లో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి డిజైనర్స్‌ను పిలిపించుకుని, వారిని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ ఆ యువతి వీడియో ద్వారా వెల్లడించింది.
లీలావతి, ఆమె కుమారుడు అనుష్ చౌదరి తమను మెంటల్‌గా టార్చర్ చేస్తున్నారని ఆ యువతి ఆరోపించింది. తన కొడుకుని పెళ్లి చేసుకోవాలని లీలావతి ఒత్తిడి తెచ్చి, అంగీకరించకపోతే వేధింపులు పెంచిందని వీడియోలో పేర్కొంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి