రాయలసీమ న్యూస్ - కర్నూలు
నగరంలోని మాసుంబాషా దర్గా సమీపంలో తెలుగుదేశం కార్యకర్త ఇంతియాజ్ (37)ను గురువారం అర్థరాత్రి నగదు వివాదం నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని, నగదు వివాదం, పాత హత్య కేసు అనుమానాలు, రాజకీయ కోణం తదితర అంశాలపై విస్తృత దర్యాప్తు జరుపుతున్నారు.
మాసుంబాషా దర్గా సమీపంలో తెలుగుదేశం కార్యకర్త ఇంతియాజ్ హత్య నగరంలోని మాసుంబాషా దర్గా సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంతియాజ్ (37) దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గురువారం అర్థరాత్రి నగదు విషయంలో జరిగిన ఘర్షణ ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, అర్థరాత్రి సమయంలో ఇంతియాజ్‌తో ఇద్దరు వ్యక్తులు నగదు విషయంలో వాగ్వివాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో ఆ ఇద్దరు వ్యక్తులు ఇంతియాజ్‌పై రాళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి