రాయలసీమ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్
యువ హీరో తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా పీపుల్స్ మీడియా బ్యానర్‌పై ‘జాంబీ రెడ్డి: నెక్ట్స్ లెవల్’ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాకు సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు.
‘హనుమాన్’, ‘మిరాయ్’ విజయాల తర్వాత తేజ కెరీర్‌లో ఇది మరో కీలక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. ‘జాంబీ రెడ్డి: నెక్ట్స్ లెవల్’ ప్రకటించిన పీపుల్స్ మీడియా ‘హనుమాన్’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో తేజ సజ్జ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఆయన అభిమానులను ఆనందపరిచేలా ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వెలువడింది. తేజ కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘జాంబీ రెడ్డి’ చిత్రానికి సీక్వెల్ రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి