రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతి లీలామహల్ ప్రాంతంలో పానీపూరి తోపుడు బండిలో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో మంటలు చెలరేగి బండి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు నీటితో మంటలను అదుపు చేసి, వాహనాలు, ఇతర బండులను తొలగించడం వల్ల పెద్ద ప్రమాదం, ప్రాణనష్టం తప్పింది.
ఈ ఘటనతో గ్యాస్ సిలిండర్ల వినియోగంలో భద్రతా ప్రమాణాలు పాటించాలని నిపుణులు, స్థానికులు మరోసారి హెచ్చరిస్తున్నారు. తిరుపతి లీలామహల్‌లో పానీపూరి తోపుడు బండికి మంటలు తిరుపతి నగరంలోని లీలామహల్ ప్రాంతంలో పానీపూరి తోపుడు బండిలో గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగిన ఘటన స్థానికులను ఒక్కసారిగా భయబ్రాంతులకు గురిచేసింది.
శనివారం సాయంత్రం సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో తోపుడు బండి పూర్తిగా దగ్ధమైంది. అయితే స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి