రాయలసీమ న్యూస్ - అన్నమయ్య

మదనపల్లె కలెక్టరేట్ ఎదుట ట్రాన్స్‌జెండర్ స్వాతి ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె కలెక్టరేట్‌ ఎదుట ట్రాన్స్‌జెండర్‌ స్వాతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. డమేరేశ్వర్‌ దంపతులు తన వద్ద నుంచి సుమారు రూ.6 కోట్లు, బంగారం తీసుకుని మోసం చేశారని, ఫిర్యాదులు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనలో పాల్గొన్న స్వాతిని పోలీసులు అడ్డుకుని తరలించగా, ఘటనపై విచారణ కొనసాగుతోంది.

మదనపల్లె కలెక్టరేట్ ఎదుట ట్రాన్స్‌జెండర్ స్వాతి ఆత్మహత్యాయత్నం మదనపల్లె, అన్నమయ్య జిల్లా: మదనపల్లె కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ట్రాన్స్‌జెండర్ స్వాతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. చీకిలగుట్టకు చెందిన స్వాతి, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు దిగినట్లు సమాచారం.

స్వాతి ఆరోపణల ప్రకారం, డమేరేశ్వర్ దంపతులు తన వద్ద నుంచి సుమారు రూ.6 కోట్ల నగదు, బంగారం తీసుకుని మోసం చేసినట్లు తెలిపింది. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులకు, సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు అక్కడ ఉన్నవారు తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →