రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుమల తిరుపతి దేవస్థానం లో శాశ్వత ఉద్యోగుల కొరత తీవ్రంగా పెరుగుతోంది. జులై 31న ఒక్కరోజే 37 మంది, అందులో 11 మంది ఆప్రైజర్లు పదవీ విరమణ చేయడంతో కీలక విభాగాల్లో పనితీరు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
టీటీడీ పరిధిలోని ఆలయాల ఆభరణాల భద్రత, విలువ నిర్ధారణకు అనుభవజ్ఞులైన శాశ్వత సిబ్బంది అత్యవసరమని ఉద్యోగ సంఘాలు ఖాళీలను తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. టీటీడీలో శాశ్వత ఉద్యోగుల కొరత తీవ్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో శాశ్వత ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.
శుక్రవారం జులై 31న ఒక్కరోజే 37 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనుండటంతో, ఇప్పటికే పలు కీలక విభాగాల్లో ఉన్న సిబ్బంది కొరత మరింతగా పెరిగే పరిస్థితి ఏర్పడింది. టీటీడీలో ఖాళీగా ఉన్న శాశ్వత ఉద్యోగాల భర్తీపై అధికారులు తగినంత దృష్టి సారించకపోవడంతో అనేక విభాగాలు ప్రస్తుతం అవుట్‌సోర్సింగ్ సిబ్బందిపైనే ఆధారపడుతున్నాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి