రాయలసీమ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్
‘వదంతి-2’లో చెన్నై–మదురై రహదారి పనుల సమయంలో బయటపడిన అస్థిపంజరం, బ్రేస్‌లెట్ ఆధారంగా ఎస్సై మూసా రాజా నీలవతి, వెన్బా హత్య కేసును రీ–ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఎనిమిది ఎపిసోడ్స్ నిడివి కొద్దిగా ఎక్కువైనా, చివరి రెండు ఎపిసోడ్స్‌లో వరుస ట్విస్ట్‌లు, నిజమైన హంతకులు, వారి ఉద్దేశం బయటపడే తీరు మంచి థ్రిల్లింగ్ అనుభూతి కలిగిస్తుంది.
రివ్యూ ఉత్కంఠను రెట్టింపు చేసిన ‘వదంతి-2’ వెబ్‌సిరీస్ చెన్నై–మదురై ఎనిమిది వరుసల రహదారి నిర్మాణ పనుల కోసం భూమి పూజ అనంతరం మట్టి తవ్వుతుండగా అక్కడ ఓ అస్థిపంజరం బయటపడటం కథకు ఆరంభం. ఈ ఘటనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం చెలరేగుతుంది.
జిల్లా ఎస్పీగా ఉన్న రతికా నాయర్ (అనఘ)ను ఈ కేసు విచారణ బాధ్యతలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తారు. నీతి, నిజాయతీకి మారుపేరుగా పేరొందిన పోలీస్ ఆఫీసర్ మూసా రాజా (శశికుమార్) గత రికార్డు చూసిన ఎస్పీ రతికా, ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను అతనికి అప్పగిస్తుంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి