రాయలసీమ న్యూస్ - అన్నమయ్య

ఎస్టీ జాబితాలో చేర్చే వరకు ఎన్నికల బహిష్కరణకు వాల్మీకి బోయల తీర్మానం

చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం బోడిమల్లెదిన్నె గ్రామంలోని వాల్మీకి బోయలు, తమకు ఎస్టీ హోదా కల్పించే వరకు ఎలాంటి ఎన్నికల్లోనూ పాల్గొనబోమని గ్రామ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రతి ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి తరువాత విస్మరించే రాజకీయ పార్టీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారు, ప్రభుత్వం నుంచి ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై స్పష్టమైన నిర్ణయం వచ్చే దాకా ఎన్నికల బహిష్కరణ కొనసాగిస్తామని స్పష్టం చేశ

ఎస్టీ జాబితాలో చేర్చే వరకు ఎన్నికల బహిష్కరణకు వాల్మీకి బోయల తీర్మానం మదనపల్లె మండలం బోడిమల్లెదిన్నె గ్రామానికి చెందిన వాల్మీకి బోయలు, తమను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు ఎలాంటి ఎన్నికల్లోనూ పాల్గొనబోమని ఏకగ్రీవంగా తీర్మానించారు. గురువారం రాత్రి గ్రామంలోని స్థానిక ఆలయం వద్ద నిర్వహించిన సమావేశంలో వారు సామూహికంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

సమావేశంలో మాట్లాడిన వాల్మీకి బోయలు, ప్రతి ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు తమను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీలు ఇస్తూ ఓట్లు పొందుతున్నాయని ఆరోపించారు. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ హామీలను అమలు చేయకుండా తమను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →