రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. వేద పండితుల నేతృత్వంలో హోమాలు, పూర్ణాహుతి, అవభృధ స్నానం, మహా మంగళహారతి నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా హాజరై దర్శనం చేసుకున్నారు.
అన్నప్రసాదం, తాగునీరు, పార్కింగ్ వంటి సౌకర్యాలు కల్పించి, సాయంత్రం ప్రత్యేక అలంకరణ, పూజలు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రొద్దుటూరు లో వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ప్రతిష్ఠ ఉత్సవాలు ప్రొద్దుటూరు పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు పూలతో, దీపాలతో అలంకరించి పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లలో నిలబడ్డారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి