రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 22వ వార్డులో ప్రజా సమస్యల పరిష్కారానికి బేపారి ఆరిఫ్ చేపట్టిన "ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. రహదారులు, కాలువలు, దోమల బెడద, పిచ్చికుక్కల దాడులు, స్ట్రీట్ లైట్లు, తాగునీటి సరఫరా వంటి సమస్యలను గుర్తించి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చల్లా శ్రీనివాస విక్రమ్‌లకు వినతిపత్రాలు అందజేశారు.
సమస్యల పరిష్కారం వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆరిఫ్ స్పష్టం చేశారు. 22వ వార్డు సమస్యలపై బేపారి ఆరిఫ్ ఉద్యమం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు ప్రజా సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా చేసుకుని బేపారి ఆరిఫ్ చేపట్టిన కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది.
"ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమం ద్వారా ఆయన వార్డు అంతటా పర్యటిస్తూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజల ఆవేదనను నమోదు చేసి, సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చల్లా శ్రీనివాస విక్రమ్‌లకు వినతిపత్రాలు అందజేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి