రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లా బద్వేల్ సమీపంలోని లక్ష్మీపాలెం చెరువులో ఆదిలక్ష్మి (50) ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన ఘటన స్థానికులను కలచివేసింది. కుటుంబ సమస్యలతో మానసిక ఆందోళనలో ఉన్న ఆమె కల్లాపి మందు సేవించి చెరువులో దూకినట్లు పోలీసులు, గ్రామస్తులు తెలిపారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బద్వేల్ సమీపంలో చెరువులో దూకి మహిళ మృతి బద్వేల్: బద్వేల్ సమీపంలోని లక్ష్మీపాలెం చెరువులో ఓ మహిళ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.
కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ఈ మహిళ ముందుగా కల్లాపి మందు సేవించి, అనంతరం చెరువులో దూకినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలిని బద్వేల్‌కు చెందిన ఆదిలక్ష్మి (50)గా గుర్తించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి