రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

యోగి వేమన యూనివర్సిటీలో BFA కోర్సు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

యోగి వేమన యూనివర్సిటీలో నాలుగేళ్ల BFA కోర్సు ప్రవేశాలకు ఈ నెల 11లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ కోటా మృత్యుంజయరావు తెలిపారు. ఇంటర్ లేదా డిప్లొమో పూర్తి చేసిన విద్యార్థులు OAMDC, cets.apche.ap.gov.in లేదా YVU వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఫైన్ ఆర్ట్స్‌లో ఉన్నత విద్య కోరుకునే వారికి ఇది మంచి అవకాశమని సూచించారు.

యోగి వేమన యూనివర్సిటీలో BFA కోర్సు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం కడప : యోగి వేమన యూనివర్సిటీలో నాలుగేళ్ల బాచిలర్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ (BFA) కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 11లోపు దరఖాస్తులు చేసుకోవాలని సంబంధిత విభాగం విద్యార్థులకు సూచించింది. ఈ మేరకు వైవీయూ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ కోటా మృత్యుంజయరావు వివరాలు వెల్లడించారు.

ఇంటర్ లేదా డిప్లొమో పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సుకు అర్హులని ఆయన తెలిపారు. ఫైన్ ఆర్ట్స్ రంగంలో ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు నిర్ణయించిన గడువు లోపు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించుకోవాలని సూచించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →