రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడపలోని యోగి వేమన యూనివర్సిటీలో ఎర్త్ సైన్స్ విభాగానికి చెందిన ప్రొ.టి.లక్ష్మీ ప్రసాద్‌ను కొత్త Controller of Examinationsగా నియమిస్తూ విశ్వవిద్యాలయం ఆదేశాలు జారీ చేసింది. పదవీకాలం పూర్తయిన ప్రొ.కృష్ణారావు స్థానంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన ద్వారా పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సాగుతుందనే నమ్మకాన్ని వైస్ చాన్సలర్ బెల్లంకొండ రాజశేఖర్ వ్యక్తం చేశారు.
యోగి వేమన యూనివర్సిటీలో కొత్త CEగా ప్రొ.టి.లక్ష్మీ ప్రసాద్ కడప : కడప జిల్లాలోని యోగి వేమన యూనివర్సిటీ (YVU)లో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ (CE)గా ఎర్త్ సైన్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ టి.లక్ష్మీ ప్రసాద్‌ను నియమించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
కొత్తగా నియమితులైన ప్రొ.టి.లక్ష్మీ ప్రసాద్‌కు నియామక ఆదేశాల ప్రతిని యోగి వేమన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ పరిపాలన విభాగం సంబంధిత ప్రక్రియలను పూర్తి చేసింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి