రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రేమ వ్యవహారంపై యువకుడిపై దాడి: 11 మంది అరెస్ట్‌

ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని స్వప్న బార్ వద్ద ప్రేమ వ్యవహారం కారణంగా లోకేశ్వర్ రెడ్డిపై బీర్ బాటిళ్లు, రాళ్లతో దాడి చేసిన కేసులో పోలీసులు వీడియో ఆధారంగా 11 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టులో ఉన్నవారిలో ఎక్కువ మంది CBIT, SRIT సహా ఇంజనీరింగ్ విద్యార్థులే కాగా, సీఐ నాగ భూషణ్ తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన, స్నేహితుల వర్గంపై అప్రమత్తంగా ఉండాలని, చెడు వ్యసనాలు, అసాంఘిక కార్యకలాపాల నుంచి వారిని దూరంగా ఉంచా

ప్రేమ వ్యవహారంపై యువకుడిపై దాడి: 11 మంది అరెస్ట్‌ ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్మలమడుగు రోడ్డులో గల స్వప్న బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఈ నెల 13వ తేదీన లోకేశ్వర్ రెడ్డి అనే యువకుడిపై ప్రేమ వ్యవహారం కారణంగా కొంతమంది యువకులు దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బీర్ బాటిళ్లు, రాళ్లతో అతనిపై దాడి చేసినట్లు సమాచారం.

ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆ వీడియోను పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించి చర్యలకు దిగారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →