రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
డీఎస్సీపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఖండించారు. డీఎస్సీ పరీక్షలను TCS iON పారదర్శకంగా నిర్వహించిందని, పేపర్ లీక్‌కు అవకాశం లేదని, వైసీపీ దాఖలు చేసిన వందలాది రిట్లు హైకోర్టులో కొట్టివేయబడ్డాయని తెలిపారు.
16 వేల ఉద్యోగాలను రద్దు చేయాలన్న వైసీపీ డిమాండ్ డీఎస్సీ ఎంపికైన అభ్యర్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నమని విమర్శించారు. డీఎస్సీపై వైసీపీ ఆరోపణలు నిరాధారం: మల్లెల లింగారెడ్డి ప్రొద్దుటూరు: డీఎస్సీ అంశంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి తీవ్రంగా ఖండించారు.
ఆదివారం స్థానిక వైఎంఆర్ కాలనీలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ పేరుతో గందరగోళం సృష్టించడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, నిషేధిత ప్రాంతాల్లో నిరసనలు చేపట్టి అరెస్టులు కావడం, అనంతరం కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని మల్లెల లింగారెడ్డి అభిప్రాయపడ్డారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి