రాయలసీమ న్యూస్ - నంద్యాల
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం అటవీ ప్రాంతంలో నరసింహ స్వామి దర్శనానికి వెళ్లిన ప్రొద్దుటూరుకు చెందిన ఐదు మంది మహిళలు, ఒక పురుషుడు బుధవారం సాయంత్రం అడవిలో దారి తప్పిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది రాత్రంతా గాలింపు నిర్వహించి గురువారం తెల్లవారుజామున వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఈ ఘటనతో భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అహోబిలం అడవిలో తప్పిపోయిన ఆరు మంది భక్తుల రక్షణ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం అటవీ ప్రాంతంలో బుధవారం ఆరు మంది భక్తులు తప్పిపోయిన ఘటన కలకలం రేపింది.
నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పావన నరసింహ స్వామి ఆలయ దర్శనానికి వెళ్లిన ఈ భక్తులను గురువారం తెల్లవారుజామున పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళ్తే, ప్రొద్దుటూరుకు చెందిన భక్తుల బృందం బుధవారం నరసింహ స్వామి ఆలయ దర్శనానికి కాలినడకన అహోబిలం అటవీ ప్రాంతం వైపు ప్రయాణం ప్రారంభించింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి