రాయలసీమ న్యూస్ టెక్నాలజీ డెస్క్
భారతీ Airtel ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ₹299, ₹319, ₹579, ₹619, ₹649, ₹799 వంటి ప్రముఖ బడ్జెట్ ప్రిపెయిడ్ ప్లాన్లను వెబ్‌సైట్, Airtel Thanks App నుంచి తొలగించింది. దీంతో రోజుకు డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ కోరుకునే వినియోగదారులకు ఇప్పుడు ₹349 ప్లాన్ కనీస ఎంపికగా మారి, నెలవారీ కనీస రీఛార్జ్ ఖర్చు సుమారు 17 శాతం పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రముఖ ప్రిపెయిడ్ ప్లాన్లు రద్దు చేసిన ఎయిర్టెల్ ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా తమ మొబైల్ వినియోగదారులకు ఎలాంటి ముందస్తు అధికారిక ప్రకటనలు లేకుండానే పెద్ద షాక్ ఇచ్చింది. అత్యంత ప్రాచుర్యం పొందిన పలు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రిపెయిడ్ ప్లాన్లను కంపెనీ నిశ్శబ్దంగా నిలిపివేసింది.
ఎయిర్టెల్ Official వెబ్ సైట్ , ఎయిర్టెల్ థాంక్స్ అప్ నుండి ఈ ప్లాన్లను తొలగించారు. వినియోగదారులు ఎక్కువగా రీఛార్జ్ చేసుకునే ₹299, ₹319, ₹579, ₹619, ₹649, ₹799 ప్రిపెయిడ్ ప్లాన్లు ఇక అందుబాటులో లేవు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి