రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతిలోని తారకరామా గ్రౌండ్స్‌లో రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ క్రీడా పోటీలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. 26 జిల్లాల నుంచి 9 వేలకుపైగా అండర్-17, అండర్-23 క్రీడాకారులు పాల్గొంటున్న ఈ భారీ క్రీడా వేడుక Asia Book of Recordsలో స్థానం దక్కించుకుంది.
యువ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి, రాష్ట్రం క్రీడా రంగంలో ముందుకు సాగేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. తిరుపతిలో రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ ఘన ప్రారంభం తిరుపతిలో రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలోని తారకరామా గ్రౌండ్స్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని పోటీలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 9 వేలకుపైగా అండర్-17, అండర్-23 వయో విభాగాలకు చెందిన బాలబాలికల క్రీడాకారులు ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో పాల్గొనేందుకు తిరుపతికి చేరుకున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి