రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప వై జంక్షన్‌లో శిథిలావస్థలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనాన్ని కూల్చి, ఆధునిక సౌకర్యాలతో కొత్త భవనం నిర్మించాలని అంబేద్కర్ భవన్ పరిరక్షణ వేదిక ప్రతినిధులు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కి వినతిపత్రం సమర్పించారు.
గ్రంథాలయం, సమావేశ మందిరం, శిక్షణ కేంద్రం, నిరుద్యోగ యువత కోసం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరిన వేదికకు ఎంపీ సానుకూలంగా స్పందించడంతో స్థానిక దళిత, సామాజిక సంఘాల్లో ఆశలు పెరిగాయి. నూతన అంబేద్కర్ భవనం నిర్మించాలి: ఎంపీ అవినాష్‌కు వినతి కడప: కడప నగరంలోని వై జంక్షన్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్.
అంబేద్కర్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో, ప్రస్తుత నిర్మాణాన్ని తొలగించి అదే స్థలంలో ఆధునిక సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మించాలని అంబేద్కర్ భవన్ పరిరక్షణ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కడప ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కి పరిరక్షణ వేదిక ప్రతినిధులు వినతిపత్రాన్ని సమర్పించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి