రాయలసీమ న్యూస్ వెదర్ డెస్క్
ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో కూడిన వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో APSDMA పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉండగా, అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, పిడుగులు సంభవించే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.
ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించి, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని APSDMA హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో వర్షాలు: పలు జిల్లాలకు APSDMA హెచ్చరికలు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
ఈ వర్షాల సమయంలో ఈదురు గాలులు, పిడుగులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) నిరంతరం ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి