రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా రోడ్డు భద్రతా కమిటీ ఆధ్వర్యంలో మదనపల్లె కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పాదచారుల రక్షణ, బ్లాక్ స్పాట్స్‌లో సంయుక్త తనిఖీలు, ట్రామా కేర్ సెంటర్, రెస్ట్ సెంటర్లు, ట్రాఫిక్ నిబంధనల కఠిన అమలు, ‘రహ్ వీర్లు’ సత్కారం వంటి చర్యలను సూచించారు
రోడ్డు ప్రమాదాల నివారణకు అన్నమయ్య జిల్లాలో సమగ్ర చర్యలు అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రయాణికులు, పాదచారుల ప్రాణాలను రక్షించేందుకు జిల్లా యంత్రాంగం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ దిశగా మదనపల్లె కలెక్టరేట్‌లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ (DRSC) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కీలకంగా నిలిచింది.
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శ్రీ శివ్ నారాయణ శర్మ, IAS, జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, IPS సమావేశానికి హాజరై, రహదారి భద్రతకు సంబంధించి వివిధ శాఖల అధికారులకు స్పష్టమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టడం, ప్రజల ప్రాణ భద్రతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి