రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ఉచిత మెగా మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఎన్జీవోస్ పిలుపు

ఆగస్టు 9, ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఎన్జీవో హోంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించనున్నట్లు ఏపీ ఎన్జీవోస్ వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షులు బలపనూరు శ్రీనివాసులు తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లు, సాధారణ ప్రజలందరికీ గుండె, ఆర్థోపెడిక్, కంటి, జనరల్ మెడిసిన్ వంటి విభాగాల్లో ఉచిత పరీక్షలు, వైద్య సలహాలు, మందుల పంపిణీ ఉండనున్న ఈ శిబిరాన్ని సద్వినియోగం చేస

ఉచిత మెగా మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఎన్జీవోస్ పిలుపు కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించనున్న ఉచిత మెగా మెడికల్ క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఎన్జీవోస్ వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షులు బలపనూరు శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఉద్యోగులు, పెన్షనర్లు, సాధారణ ప్రజలందరికీ ఈ వైద్య శిబిరం ఉపయోగకరంగా ఉండనుందని ఆయన పేర్కొన్నారు.

ఆదివారం ఆగస్టు 9న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రొద్దుటూరులోని ఎన్జీవో హోంలో ఈ మెగా మెడికల్ క్యాంపును నిర్వహించనున్నట్లు శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరు ఎన్జీవో హోంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →