రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

సీనియర్ టీచర్లకు కంప్యూటర్ ఆధారిత టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి: APTF

ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్, ఇన్ సర్వీస్ టీచర్లకు కంప్యూటర్ ఆధారిత టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే సేవలో ఉన్న ఉపాధ్యాయులు బోధన అనుభవం, సేవా కాలం ద్వారా అర్హత నిరూపించుకున్నందున వారికి మళ్లీ టెట్ అవసరం లేదని, తప్పనిసరిగా నిర్వహించాల్సి వస్తే కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ విధానంలో కాకుండా రాత పరీక్షల రూపంలో ఉండాలని ఆయన సూచించారు.

సీనియర్ టీచర్లకు కంప్యూటర్ ఆధారిత టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి: APTF ప్రొద్దుటూరు : సీనియర్ టీచర్లకు కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువగా ఉండటంతో, కంప్యూటర్ ఆధారిత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ ) పరీక్షల నుంచి వారిని మినహాయించాలని ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ప్రొద్దుటూరులోని కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న కంప్యూటర్ ఆధారిత టెట్ విధానం సీనియర్ టీచర్లకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చాలామంది ఇన్ సర్వీస్ టీచర్లు కంప్యూటర్ వినియోగంలో నైపుణ్యం లేకపోవడంతో, వారికి ఈ విధానం భారంగా మారుతుందని పేర్కొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →