రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై వార్త రాసిన విశాలాంధ్ర విలేకరి గోవిందుపై జరిగిన దాడిని APUWJ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు నిరసనగా రాజంపేట Sub Collector కార్యాలయం వద్ద జర్నలిస్టులు ఆందోళన నిర్వహించి, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
విలేకరిపై దాడి దారుణం: రాజంపేటలో జర్నలిస్టుల నిరసన రాజంపేట: సమాజంలో వాస్తవాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఎంతమాత్రం సహించేది లేదని ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) నాయకులు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై వార్తా కథనాన్ని రాసినందుకు గాను, విశాలాంధ్ర విలేకరి గోవిందుపై జరిగిన భౌతిక దాడిని యూనియన్ తీవ్ర
ఈ ఘటనకు నిరసనగా కడప జిల్లా రాజంపేటలోని Sub కలెక్టర్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి