రాయలసీమ న్యూస్ - కర్నూలు

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మిగనూరులో APWJF నిరసన

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ APWJF ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన జరిగింది. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, పక్కా గృహాలు, 60 ఏళ్లు దాటిన వారికి పింఛన్, అసంఘటిత కార్మికుల హోదా, ప్రత్యేక చట్టం, మీడియా కమిషన్, హైపవర్ కమిటీ,మీడియా అకాడమిక్ గవర్నింగ్ కౌన్సిల్ చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మిగనూరు లో APWJF నిరసన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APWJF) ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం జరిగింది. జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట స్థానిక పాత్రికేయులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుతంగా ఆందోళన చేపట్టారు.

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని APWJF గౌరవ అధ్యక్షులు గిప్సన్, దేవేంద్ర మూర్తి, అధ్యక్షుడు షబ్బీర్ తదితరులు డిమాండ్ చేశారు. అనంతరం వారు తమ అభ్యర్థనలు, డిమాండ్లను వివరించిన వినతిపత్రాన్ని డిప్యూటీ తహసిల్దార్‌కు అందజేశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →