రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లా బద్వేల్ పరిసరాల్లో అబుసాయిపేట సర్వే నెంబర్ 1 ప్రాంతంలో రాత్రివేళల్లో విచ్చలవిడిగా గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని బద్వేల్ ఎమ్మార్వో తిరుమల బాబు స్పష్టం చేస్తూ, అధికారుల పేర్లు చెప్పుకుంటూ అక్రమ దందా చేస్తే కఠిన చర్యలు, కేసులు తప్పవని హెచ్చరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
బద్వేల్ పరిసరాల్లో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు కడప జిల్లా బద్వేలు పట్టణం పరిసర ప్రాంతాల్లో గ్రావెల్ మాఫియా దారులు మళ్లీ రెచ్చిపోతున్నారు. గతంలో సాయిబాబా గుడి సమీపంలో అక్రమంగా గ్రావెల్ తోలుతున్న విషయం వెలుగులోకి రావడంతో, సంబంధిత మాఫియా దారులు మార్గం మార్చి ఇప్పుడు అబుసాయిపేట సమీపంలోని సర్వే నెంబర్ 1 ప్రాంతాన్ని ఆశ్రయించినట్లు స్థానికులు చెబుతున్నారు.
రాత్రి వేళల్లో ఆ ప్రాంతంలో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని, అధికార నాయకుల పేర్లు చెప్పుకుంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుమతి ఇచ్చిందని చెప్పుకుంటూ మట్టి మాఫియా దారులు దందా కొనసాగిస్తున్నారని సమాచారం. అధికారుల కళ్లకు గంతలు కట్టి, నియమ నిబంధనలను పక్కన పెట్టి జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి