రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతి బైరాగిపట్టేడలోని ‘బిర్యానీ ఫ్యాక్టరీ’ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడి చేసి, ట్రేడ్ లైసెన్స్ లేకపోవడం, ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో రెస్టారెంట్‌ను సీజ్ చేశారు. వంటశాల, నిల్వ గదులు, పరిశుభ్రత పరిస్థితుల్లో పలు లోపాలు గుర్తించడంతో కార్యకలాపాలను నిలిపివేసి, చట్టపరమైన తదుపరి చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తిరుపతి లో ‘బిర్యానీ ఫ్యాక్టరీ’ రెస్టారెంట్‌ను సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తిరుపతి నగరంలోని బైరాగిపట్టేడలో ఉన్న ‘బిర్యానీ ఫ్యాక్టరీ’ రెస్టారెంట్‌పై గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడి నిర్వహించారు. తనిఖీల సందర్భంగా రెస్టారెంట్‌కు అవసరమైన ట్రేడ్ లైసెన్స్ లేకపోవడంతో పాటు, ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకుండా వ్యాపారం సాగిస్తున్నట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్ ఆ రెస్టారెంట్‌ను సీజ్ చేసే చర్యలు చేపట్టారు. అక్కడి వంటశాల, నిల్వ గదులు, వాడుతున్న పదార్థాలు, పరిశుభ్రత పరిస్థితులను అధికారులు పరిశీలించినట్లు సమాచారం.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి