రాయలసీమ న్యూస్ - నంద్యాల
బనగానపల్లెలో ఏఈ నూకరాజు ఆత్మహత్యను లవ్ జీహాద్ కేసుగా పేర్కొంటూ బిజెపి నాయకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాధిక్ ఖాన్ వంచన, మోసం, దోపిడి, హత్య, లవ్ జీహాదీ ఉగ్రవాదానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ, అతనికి కఠిన శిక్షతో పాటు సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకుని, నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని, రాష్ట్ర DGP, హోం మంత్రి వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు.
లవ్ జీహాద్ కేసులో నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలంటూ బిజెపి డిమాండ్ బనగానపల్లె: బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బనగానపల్లెలో లవ్ జీహాద్ కేసుపై బిజెపి నాయకులు స్థానిక పోలీసులకు పిర్యాదు చేశారు. బనగానపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్‌కు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శివ క్రిష్ణ యాదవ్, మండల అధ్యక్షుడు యాదగిరి లవ్ జీహాద్ అంశంపై ఫిర్యాదు అందజేశారు.
వారి పిర్యాదులో సాధిక్ ఖాన్ కారణంగా ఏఈ నూకరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనను లవ్ జీహాద్ పరిణామంగా పేర్కొంటూ, నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి