బనగానపల్లె: బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బనగానపల్లెలో లవ్ జీహాద్ కేసుపై బిజెపి నాయకులు స్థానిక పోలీసులకు పిర్యాదు చేశారు. బనగానపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్‌కు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శివ క్రిష్ణ యాదవ్, మండల అధ్యక్షుడు యాదగిరి లవ్ జీహాద్ అంశంపై ఫిర్యాదు అందజేశారు.

వారి పిర్యాదులో సాధిక్ ఖాన్ కారణంగా ఏఈ నూకరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనను లవ్ జీహాద్ పరిణామంగా పేర్కొంటూ, నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు.

పిర్యాదులో ఈ కేసులో వంచన, మోసం, దోపిడి, హత్య, లవ్ జీహాదీ ఉగ్రవాదం అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సాధిక్ ఖాన్‌ను కఠినంగా శిక్షించాలని, అతనికి సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

YSRCP కాకినాడ నాయకుని సిఫార్సుతో ఇంటర్నేషనల్ స్కూల్‌లో రైఫిల్ షూటింగ్ శిక్షకునిగా పని చేస్తూ సాధిక్ ఖాన్ నూకరాజుతో పరిచయం పెంచుకున్నాడని పిర్యాదులో పేర్కొన్నారు. ఆ పరిచయం తరువాత జరిగిన పరిణామాల వల్లే నూకరాజు ఆత్మహత్యకు దారితీసిందని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు.

ఈ కేసులో ఉన్న అన్ని కోణాలను విచారించి, నూకరాజు కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర DGP, హోం మంత్రి ఈ సంఘటనపై వెంటనే స్పందించి, దర్యాప్తును వేగవంతం చేయాలని పిర్యాదులో కోరారు.

లవ్ జీహాద్ పేరుతో జరుగుతున్న ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బిజెపి నాయకులు తమ పిర్యాదులో పేర్కొన్నారు.