రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప బ్రహ్మంగారిమఠంలో జరుగుతున్న పరిణామాలపై మారుతి మహాలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, మఠం పవిత్రతకు విఘాతం కలిగించే అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాత్కాలిక మఠాధిపతిగా ఉన్న వెంకటాద్రి స్వామి, పిపిఎన్ ప్రసాద్, దత్తాత్రేయులు మహిళలు, పిల్లలపై బెదిరింపులు, ఆస్తి నష్టం, అవమానకర చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ, వీరిపై ప్రభుత్వం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని బ్రహ్మంగారిమఠం పవిత్రతను కాపాడాలని
బ్రహ్మంగారిమఠంలో అరాచకాలు తీవ్రం: పిపిఎన్ ప్రసాద్‌పై చర్యలు కోరుతున్న మారుతి మహాలక్ష్మి కడప : భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి ముందుగానే కాలజ్ఞానం ద్వారా ప్రపంచానికి తెలియజేసిన పవిత్ర శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ప్రస్తుతం అరాచకాలకు కేంద్రంగా మారిందని పూర్వ పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి ధర్మపత్ని మారుతి మహాలక్ష్మి ఆరోపించారు. కడప ప్రెస్ క్లబ్
బ్రహ్మంగారిమఠం పవిత్రతను కాపాడాల్సిన కొందరి స్వార్థ రాజకీయాల వల్ల ఈ ఆధ్యాత్మిక కేంద్రం రౌడీ రాజ్యాన్ని తలపిస్తోందని ఆమె విమర్శించారు. ధార్మిక పరిషత్ కేవలం మూడు నెలలపాటు సజావుగా వ్యవహారాలు సాగేందుకు తాత్కాలిక మఠాధిపతిగా వెంకటాద్రి స్వామిని నియమించగా, ఆయన ఆ పదవిని శాశ్వత అడ్డాగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిపై శారద గురుపీఠ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోందని తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి