రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
విశాఖపట్నంలో జరిగిన రెండు రోజుల BRICS యువజన, క్రీడా మంత్రుల సదస్సులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని యువత, క్రీడల అభివృద్ధి, సాంకేతికత, స్టార్టప్‌లు, క్రీడా మౌలిక వసతులపై చర్చించారు. నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ విద్య, స్టార్టప్ ప్రోత్సాహంతో యువతను ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని, BRICS దేశాల మధ్య యువజన మార్పిడి, స్పోర్ట్స్ టూరిజం సహకారం పెరగడం ద్వారా అంతర్జాతీ
విశాఖలో BRICS యువజన, క్రీడా మంత్రుల సదస్సు రాయచోటి: విశాఖపట్నంలో రెండు రోజులపాటు నిర్వహించిన BRICS యువజన మరియు క్రీడా మంత్రుల సమావేశంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. భారత్ BRICS అధ్యక్షతలో జరిగిన ఈ సదస్సులో యువత, క్రీడల అభివృద్ధి, సాంకేతికత, స్టార్టప్‌లు, క్రీడా మౌలిక వసతులు, అంతర్జాతీయ సహకారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి యువత, క్రీడల రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించారు. యువతను ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలు సృష్టించే యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ విద్య, స్టార్టప్ ప్రోత్సాహక కార్యక్రమాలను విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి