రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
పలమనేరు–మదనపల్లె మార్గంలో బస్సు నడుపుతూ సెల్‌ఫోన్ చూస్తూ ప్రయాణం కొనసాగించిన పలమనేరు డిపోకు చెందిన డ్రైవర్ కె. గణేష్‌కుమార్‌ను వీడియో ఆధారంగా గుర్తించి విధుల నుంచి వెంటనే తొలగించారు.
ప్రయాణికుల భద్రతపై రాజీ ఉండదని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి స్పష్టం చేయగా, ఇటువంటి నిర్లక్ష్యానికి పాల్పడే ఆర్టీసీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సెల్‌ఫోన్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్ విధుల నుంచి తొలగింపు ప్రయాణికుల భద్రత కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నిర్లక్ష్యంతో చిన్నపాటి ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
ప్రమాదరహిత రవాణా కోసం ఆర్టీసీ సిబ్బందిని అధికారులు తరచూ హెచ్చరిస్తున్నా కొందరు వాటిని పట్టించుకోవడం లేదు. చిత్తూరు జిల్లా పలమనేరు డిపోకు చెందిన ఓ డ్రైవర్ ఇటువంటి నిర్లక్ష్యానికి పాల్పడ్డాడు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి