రాయలసీమ న్యూస్ ఇంటర్నేషనల్ డెస్క్
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లోని నానా మంబెరే ప్రాంతంలో బంగారు గని కుప్పకూలి కనీసం 30 మంది కార్మికులు మృతి చెందగా, మరికొందరు మట్టి కింద చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. భారీగా మట్టి, రాళ్లు కూలిపోవడంతో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి.
గనిలో భద్రతా ప్రమాణాలు, తవ్వకాల విధానం పై ప్రాథమిక విచారణ ప్రారంభమై, ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలకు దారితీసింది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో బంగారు గని కుప్పకూలి 30 మంది మృతి ఆఫ్రికా ఖండంలోని సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో బంగారు గని కుప్పకూలిన ఘటనలో కనీసం 30 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
నానా మంబెరే ప్రాంతంలో ఉన్న ఈ గనిలో వందలాది మంది కార్మికులు మైనింగ్ పనుల్లో నిమగ్నమై ఉండగా ప్రమాదం జరిగింది. స్థానిక సమాచారం ప్రకారం, కార్మికులు గనిలో లోతుగా తవ్వకాలు చేస్తుండగా ఒక్కసారిగా మట్టి గోడలు కూలి భారీగా జారిపడ్డాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి