రాయలసీమ న్యూస్ - కర్నూలు
నగర అభివృద్ధిలో భాగంగా చారిత్రాత్మక గడియారం ఆసుపత్రి ఆధునికీకరణ, ఆంజనేయస్వామి ఆలయం వెనుక నూతన బైపాస్ రహదారి, కొండారెడ్డి బురుజు ఓపెన్ థియేటర్ పార్కులో ఔట్‌డోర్ ప్రొజెక్షన్ స్క్రీన్‌ను మంత్రి టి.జి. భరత్ బుధవారం ప్రారంభించనున్నారు.
కమిషనర్ చల్లా ఓబులేసు డ్రైనేజీ సమస్యలు, అన్న క్యాంటీన్ సేవలను పరిశీలించి శాశ్వత పరిష్కారం, నాణ్యమైన ఆహారం, మెరుగైన ప్రజా సౌకర్యాల కోసం చర్యలు చేపట్టారు. నగర అభివృద్ధిలో మరో కీలక మైలురాయి: బుధవారం నూతన బైపాస్, గడియారం ఆసుపత్రి ప్రారంభం నగరంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతో నగరపాలక సంస్థ మరో కీలక మైలురాయిని చేరుకోనుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
మంగళవారం ఆయన నగరంలో పూర్తి అయిన కీలక అభివృద్ధి పనులను పరిశీలించి, తుది ఏర్పాట్లను సమీక్షించారు. కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ నగర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని పేర్కొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి