రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
రాయచోటిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్రపటాలకు తెలుగుదేశం శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు. HNSS పనులు ప్రారంభించి రాయచోటి, అన్నమయ్య జిల్లాలో చెరువులు నింపి 25 వేల ఎకరాలకు నీరు అందించడంతో రైతులకు తాగునీరు, సాగునీటికి శాశ్వత భరోసా కల్పించారని, కరువును తగ్గించే చర్యలకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు తెలిపారు.
రాయచోటిలో సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం రాయచోటి: అన్నదాతల కళ్లల్లో ఆనందం మెండుగా కనిపించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాయచోటి నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు బుక్కే విశ్వనాథ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో కరువుకు చెక్ పెట్టినట్లు తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి