రాయచోటి: అన్నదాతల కళ్లల్లో ఆనందం మెండుగా కనిపించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాయచోటి నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు బుక్కే విశ్వనాథ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో కరువుకు చెక్ పెట్టినట్లు తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. ఐదేళ్ల పాటు YCP ప్రభుత్వం పట్టించుకోని రాయచోటికి, కూటమి ప్రభుత్వం వచ్చి ఒక్క ఏడాదిలోనే రూ.350 కోట్లు కేటాయించి HNSS పనులు ప్రారంభించిందని వారు వివరించారు. చేతల ప్రభుత్వమే ఇది అని నాయకులు వ్యాఖ్యానించారు.

రాయచోటి బిడ్డ, రాయచోటి గొంతు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అని స్థానిక నాయకులు అభివర్ణించారు. CM చంద్రబాబు వద్దకు వెళ్లి పోరాడి, రూ.1323 కోట్లలో రాయచోటికి ప్రత్యేక వాటా తీసుకురావడంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక పాత్ర పోషించారని వారు తెలిపారు. పదవి కోసం కాదు, ప్రజల కోసం పని చేసే నాయకుడే మండిపల్లి అని నాయకులు పేర్కొన్నారు.

మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చర్యలతో 25 వేల ఎకరాలకు జీవం పోసినట్లు తెలుగుదేశం శ్రేణులు తెలిపారు. ఖాళీ చెరువులను నింపి రాయచోటి, అన్నమయ్య జిల్లా రైతులకు తాగునీరు, సాగునీటికి శాశ్వత భరోసా కల్పించారని వారు చెప్పారు. రైతు కన్నీళ్లు తుడిచిన నిజమైన నాయకుడు మండిపల్లి అని స్థానిక నేతలు అభిప్రాయపడ్డారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకున్నామని తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. HNSS ప్రాజెక్టును పూర్తి చేసి రాయలసీమను కరువు రహితంగా మార్చే సంకల్పంతో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారని, ఈ లక్ష్య సాధనలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవ కీలకమని వారు చెప్పారు.

రాయచోటి, పరిసర ప్రాంతాల నుంచి రైతులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాలాభిషేక కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పట్ల కృతజ్ఞతాభావంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుగుదేశం శ్రేణులు తెలిపారు.