రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పించే కార్యక్రమం కొనసాగుతోంది. 30వ విడతగా 53 మంది లబ్ధిదారులకు 52.62 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేయగా, ఇప్పటి వరకు మొత్తం 1,355 మందికి సుమారు 11.87 కోట్ల రూపాయలు అందించారు.
పేదలకు మెరుగైన వైద్యం, వైద్య ఖర్చుల భారం తగ్గించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో పేదలకు సీఎం ఆర్థిక భరోసా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పించే కార్యక్రమం కొనసాగుతోంది.
ప్రొద్దుటూరు తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించిన 30వ విడతగా 53 మంది లబ్ధిదారులకు మొత్తం 52.62 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి